అమ్మఒడికి పన్నెండు షరతులు
Ammavodi Rules : అమ్మఒడి పథకం లబ్దిదారులను భారీగా తగ్గింది. పన్నెండు రకాల నిబంధనలను ప్రభుత్వం పెట్టింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకంలో ఈ సారి లబ్దిదాలు సంఖ్యను తగ్గించారు. అర్హులు తగ్గిపోయారని ప్రభుత్వం చెబుతోంది. అర్హతా నిబంధనలు సాధించలేకపోవడంతో అమ్మఒడి పథకం మూడో విడత సాయంలో 1.29 లక్షల మంది తల్లులకు ప్రభుత్వం కోత పెట్టాలని నిర్ణయించింది. కోవిడ్ కారంణంగా పాఠశాలలకు గైర్హాజరు కావటంతో 51 వేల మందికి అమ్మఒడి పథకానికి అనర్హులుగా ప్రభుత్వం తేల్చింది. మిగతా 50 వేల మంది పైచిలుకు విద్యార్ధులకు వేర్వేరు కారణాలతో పథకం నిలిపివేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అర్హుల జాబితాను పంపించిన ప్రభుత్వం.. అనర్హుల జాబితాను మాత్రం ఇవ్వలేదు. లబ్దిదారుల జాబితాలో ఉన్న వారు తప్ప మిగతా వారంతా అనర్హులేనని ప్రభుత్వం ప్రకటించింది.
0 కామెంట్‌లు